Yevaro Choodali (Female)
K. S. Chithra
Yevaro Choodali (Female) 歌詞
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి
ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
◇ సంగీతం ◇
హో తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా
వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని
నెమ్మదిగా నా మదికి నమ్మకమందించేదెవరు
ఎవరో... ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
◇ సంగీతం ◇
హో వరసే కలిపే చనువై నను తడిమే పూలతో
కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో
ఎపుడో కన్న తీపి కల ఎదురవుతుంటే దీపికలా
శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో
ఎవరో...