Anaganaga Oka Uru

歌手 Sri Dhruthi Sri Dhruthi

Anaganaga Oka Uru 歌詞



అనగనగా ఒక ఊరు
అనుకోకుండా ఒకనాడు
కలిశారే పసివాళ్ళు స్నేహంగా

సంతోషమంతా రెక్కలుగా
రివ్వంటూ ఎగిరే పక్షులుగా
ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా

ఒకరేమో సీను, ఒకరేమో జున్ను
కలిశారే ప్రాణంగా, కురిశారే వర్షంగా

పాటేమో సీను, ఆటేమో జున్ను
ఒకటయ్యి ఎదిగారే మధురంగా

ప్రపంచమంతా తమ ఇల్లంటూ
ప్రతీ క్షణం ఒక పండుగగా
కన్నీరు లేని కలలే కంటూ
చిన్నారి చెలిమే బలపడగా

తియతియ్యని ఊసులతో
తెలతెల్లని మనసులలో
కథ ఇలాగ మొదలయ్యేగా
కథ ఇలాగ మొదలయ్యేగా

అనగనగా ఒక ఊరు
అనుకోకుండా ఒకనాడు
కలిశారే పసివాళ్ళు స్నేహంగా

~ సంగీతం ~

ఎగిరిన బుడగలలోన చెలిమే
ఉరికిన పడవలలోన చెలిమే
రంగులరాట్నంలో చెలిమే చిందులు వేసిందే

మిణుగురు వెలుగులలోన చెలిమే
తొలకరి తేనెలలోన చెలిమే
గాజుల గలగలలో చెలిమే సందడి చెసిందే

ఈ జ్ఞాపకాలన్నీ నిలిచేనులే
నీ జీవితానికి బలమై నడిపేనులే
ఈ సాక్ష్యాలే అనుబంధాల భవనానికి స్తంభాలే

అనగనగ ఒక ఊరు
అనుకోకుండా ఒకనాడు
కలిశారే పసివాళ్ళు స్నేహంగా

తెలపని కబురులలోన చెలిమే
తిరగని మలుపులలోన చెలిమే
దొరకని చేపలలో చెలిమే దోసిలి నింపింది

జరిగిన నిమిషములోన చెలిమే
ఎరగని మరు నిమిషాన చెలిమే
కాలం చెక్కిలిలో చెలిమి చుక్కై మెరిసింది

చిననాడు మురిపించే ఈ గురుతులే
కనరాని దారిని చూపే నీ గురువులే
ఉండాలంటూ ఈ బతుకంతా మాటలకే కట్టుబడి

నా నా నా నా నా నా......
నా నా నా నా నా నా. .....


分享連結
複製成功,快去分享吧
  1. me rise me rise (wedding song)
  2. Y eve VO
  3. hello!
  4. T哈拉chit哈剌赤
  5. Anaganaga Oka Uru
  6. Anaganaga Oka Uru (Female Version)
Sri Dhruthi所有歌曲
  1. Anaganaga Oka Uru
Sri Dhruthi所有歌曲

Sri Dhruthi熱門專輯

Sri Dhruthi更多專輯
  1. Sri Dhruthi Hello! (Original Motion Picture Soundtrack)
    Hello! (Original Motion Picture Soundtrack)